రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి
కడ్తాల్, జనవరి 23 ( విజయ క్రాంతి ) : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి,ఉన్నతమైన స్థానాలలో నిలబెట్టడానికి ప్రతిఒక్కరు కష్టపడి పనిచేయాలని రాష్ట్ర సర్పంచుల సంఘము అధ్యక్షుడు, కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గురువారం కడ్తాల్ గిరిజన బాలుర ఆశ్రమ వసతి పాఠశాలకు పరేడ్ బ్యాండ్ మరియు మైక్ సెట్ అందజేశారు.
అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న కామన్ డైట్ ద్వారా విద్యార్థులకు భోజన ఏర్పాటులో సమయపాలన పాటించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, అనేక సౌకర్యాలు కల్పించారని అన్నారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని వారందరికీ రాజకీయాల కతీతంగా అందరం నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించాలని కోరారు. విద్యార్థుల విద్యాభ్యాసం మరియు వసతుల ఏర్పాటులో రాజకీయాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాములు, అధ్యాపకులు భీమ్లా పాల్గొన్నారు.