calender_icon.png 24 January, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

24-01-2025 12:00:00 AM

  1. రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి 
  2. సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ 

సంగారెడ్డి, జనవరి 23 ( విజయ క్రాంతి): విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ తెలిపారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని పి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అన్నారు. మీపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని కళాశాలకు పంపిస్తున్నారని పట్టుదలతో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు చేసుకో వాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేం దుకు ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచుకోవాల న్నారు.

మోటార్ సైకిల్‌ను నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడరా దని మద్యం సేవించి వాహనాలు నడిపేతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మార్గమధ్యలో ఫోన్ వచ్చిన సైకిల్ మోటార్ నిలిపి ఫోన్ మాట్లాడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీస్ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసింది అన్నారు. నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా యని తెలిపారు.

ప్రమాదాలు నివారించేం దుకు ప్రభుత్వం సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎన్‌ఏ డి డిఎస్పి పుష్పన్ కుమార్, సిఐలు రాము క్రాంతి కుమార్, సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తదితరులు పాల్గొన్నారు