తెలంగాణ నార్కోటెక్ విభాగం డీఎస్పి రమేష్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ నార్కోటిక్ విభాగం రాచకొండ డిఎస్పి రమేష్ సూచించారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ గంజాయి వల్ల ఏర్పడే అనర్థాలను విద్యార్థులకు తెలియజేసేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వాడడం వల్ల ఏర్పడే అనర్ధాలపై లఘు చిత్రం ప్రదర్శించారు. అనంతరం డిఎస్పీ రమేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తున్నదని అన్నారు. విద్యార్థులు పెడదారి పట్టకుండా చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు. చెడు వ్యసనాలకు బానిస అవ్వడం వల్ల భవిష్యత్ నాశనం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ సిఐ రాంబాబు, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, జీవన్ రెడ్డి, లక్ష్మీపతి ముషీరాబాద్ డిప్యూటీ ఐఓఎస్ స్వరూప రాణి, ఉపాధ్యాయులు ఫాతిమా, నరేందర్ యాదవ్, రతన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.