14-02-2025 01:08:02 AM
బాన్సువాడ ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. గురువారం రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పదో తరగతి వసతిగృహ విద్యార్థులకు విజయ స్ఫూర్తి, ప్రేరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ.. విద్యార్థులకు పదో తరగతి ఎంతో కీలకమని, కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఎంత బాగా చదివితే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధికారి వసతి గృహ వార్డెన్లు గంగాసుధా, విజయభారతి, విజయశాంతి, లక్ష్మణ్, శివరాం, పవన్, శారద, చంద్రకాంత్, సందీప్, కృష్ణ, శాంతి, దశరథ్, సంధ్య, గంగావీణ, కృష్ణ ప్రసాద్, శ్యాం, చక్రధర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.