నిర్మల్ (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం జిల్లాలో 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో మూడో సంవత్సరం కూడా రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటినుంచి కష్టపడి పని చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం 9127 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ ఓవర్స్ నిర్వహించాలని వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, సంక్షేమ శాఖ అధికారులు అంబాజీ నాయక్, రాజేశ్వర్ గౌడ్, మోహన్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.