calender_icon.png 5 January, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

31-12-2024 01:58:44 AM

* ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

* ఘనంగా భాష్యం వార్షికోత్సవం

కాప్రా, డిసెంబర్ 30: విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లాలాగూడలో జరిగిన భాష్యం ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్ బ్రాంచి పాఠశాలల ౨౦వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలు బాగా చదువుకునేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని కోరారు. బిడ్డలను మొబైల్స్‌కు అడాప్ట్ కాకుండా చూసుకోవాలని, తద్వారా వారు విద్యలో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల సీఈవో చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యున్నతికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరిం  కోరారు. అంతకు ముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర  అలరించాయి. అనం తరం అకాడమీ టాపర్స్‌కు ఎమ్మెల్యే జ్ఞాపికలు అందజేశారు.

కార్యక్రమంలో జెడ్‌ఈవో మార్కండేయులు, ప్రిన్సిపాల్స్ అమరేశ్వర్‌రావు, దివ్య, వనిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.