calender_icon.png 28 April, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి

28-04-2025 12:36:28 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 27: చదువుతో విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని  విశ్రాంత డీజీపీ పుట్టపాగా రవీంద్రనాథ్ అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాలులో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడా రు.

జిల్లాలోని ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులుకు పుట్టపాగా మహేంద్రనాథ్ స్మారక విద్యా పురస్కారాలు అంద జేశారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన పేద విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. తన తండ్రి మ హేంద్రనాథ్ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారన్నారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ఐక్యత సమాజ సంస్థ ప్రతినిధులు కళ్యాణం నర్సిహ్మా, భగవేణి నరసిం హులు,బాలరాజు, డా.రాఘవులు , న్యాయవాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.