08-02-2025 11:11:27 PM
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతోనే జీవిత లక్ష్య సాధన పూర్తి చేసుకోవాలని ఎంఈఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ స్పీకర్ రమేష్ చైతన్య అన్నారు. దోమకొండ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థుల సమావేశంలో శనివారం ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, చిట్కాలు, జ్ఞాపకశక్తి, ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలి, విలువలు నైపుణ్యాలు, జీవన ప్రమాణాలు ఎలా పెంపొందించుకోవాలి అని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి విద్యార్థి పత్తి పదార్థాలకు దూరంగా ఉండాలని, వ్యసనాలు ప్రలోభనికి గురికాకుండా ఉన్నత చదువులను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, బాలకిషన్, హరికృష్ణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.