calender_icon.png 8 February, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు పోవాలి

08-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి- 7: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్  అన్నారు. వికారాబాద్ మండలం లో శివారెడ్డి పెట్ అనంత గిరి పల్లి  తెలంగాణా సోషల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్  స్కూల్ జూనియర్ కళాశాల, ఎస్సీ బాలురహాస్టల్  రాత్రి నిద్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థులతో కలిసి ఎలా ఉన్నారని, ఎలా చదువుతున్నారని వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.  విద్యార్థులకు  అందిస్తున్న భోజనం, రోజువారి దినచర్య గురించి  అదనపు కలెక్టర్ ఆరా తీశారు.హాస్టల్  పరిసరాలను, వంటశాలను, మరుగుదొడ్లను, త్రాగు నీటి సంపు ను  పరిశీలించడం జరిగింది.

రోజు వారి మెనూ చార్ట్ ను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం  అందిస్తున్నారా అని  విద్యార్థులను అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులకు అందించే భోజన విషయంలో రుచి , శుభ్రత పాటించాలని అన్నారు.