calender_icon.png 13 March, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

13-03-2025 12:14:30 AM

రాజంపేట ఏఎస్ఐ సుభాషిని

రాజంపేట,(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని రాజంపేట ఏఎస్ఐ సుభాషిని(Rajampet ASI Subhashini) అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని తలమడ్ల హైస్కూల్లో హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ(Helping Bridge for Education organization) తరఫున పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్- విజయస్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాజంపేట ఏఎస్ఐ సుభాషిని హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని మానసిక ప్రశాంతతతో చదివితే చదివిన అన్ని అంశాలు గుర్తు ఉంటాయని పరీక్షల పట్ల భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు. అనంతరం హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిదుల అన్వేష్ రావు, ప్రసాద్ రావు మాట్లాడుతూ పదవ తరగతి తరువాత ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలను పూర్తిగా వివరిం చారు. ప్రతి విద్యార్థి చత్రపతి శివాజీ స్ఫూర్తితో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అరేపల్లి గ్రామానికి చెందిన అన్వేష్ రావు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పరీక్ష కిట్లను బహుమతిగా అందజేయడం జరిగింది. కార్యక్రమంలో హెల్పింగ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు అన్వేష్ రావు,  ప్రసాద్ పాటిల్,  సురేష్, దినేష్, కోటేష్ కుమార్ , తేజ, బల్ల కోటేష్,  కృష్ణకర్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు భిక్షపతి, ఉపాధ్యాయులు భగత్, బాలు , ఆంజనేయులు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.