01-03-2025 01:21:31 AM
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నిమ్
మందమర్రి ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి) : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని భవిష్యత్తులో బావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నిమ్ ఆన్నారు. పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీ వి రామన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని భావితరాలకు చక్కని ఆవిష్కరణలను అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రదర్శ నలను పరిశీలించి అభినందించారు. విద్యా ర్థులకు సైన్స్ రంగోలి, క్విజ్ వ్యాసరచన తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.