04-03-2025 06:25:45 PM
మండల శిశు సంక్షేమ శాఖ అధికారి రేష్మ..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): విద్యార్థినిలు వ్యక్తిగత శుభ్రత పాటించాలి అని మండల శిశు సంక్షేమ శాఖ అధికారి రేష్మ అన్నారు. మంగళవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు మహిళల రుతుక్రమ పరిశుభ్రత పైన ప్రత్యేక అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా మండల చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రేష్మ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మండల శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి రేష్మ మాట్లాడుతూ.... రుతుక్రమ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత గురించి, పాటించవలసిన ఆహారపు అలవాట్ల గురించి తెలియజేయడం జరిగిందన్నారు.
అనంతరం జిల్లా మహిళా సాధికారత కేంద్ర జిల్లా సమన్వయకర్త సౌజన్య మాట్లాడుతూ.. బాలికలు రుతుక్రమ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికున్న అపోహల గురించి చర్చించి వారికి సలహాలను ఇవ్వడం జరిగింది. అనంతరం విద్యార్థులకు స్నాక్స్, సానిటరీ క్లాత్ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు మరింత అవగాహన పెంపొందించే విధంగా వీడియోలు ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ విజయ, అకౌంటెంట్ వసంత లక్ష్మి, స్కూల్ హెడ్మాస్టర్ శైలజ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.