04-03-2025 03:52:36 PM
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్
సంగారెడ్డి,(విజయక్రాంతి): విద్యార్థులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్(District Legal Services Authority Secretary B. Ramesh) తెలిపారు. మంగళవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(National Legal Services Authority, State Legal Services Authority), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర ఆదేశాల మేరకు సదాశివపేట పట్టణంలో ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలకు అన్ని చట్టలపైనా అవగాహనా ఉండాలి అన్నారు. అందరు క్రమశిక్షణగా ఉండాలి అన్నారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అదేవిదంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. మహిళా సాధికారత సాధించడం కోసం ఈ మహిళా దినోత్సవం కార్యక్రమలు జరుపుతున్నామని తెలిపారు . విద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించాలని కోరారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ ని పిల్లలకు అందించే తిండి , వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట ఎస్ఐ కృష్ణయ్య, ప్రిన్సిపల్ లావణ్య రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.