calender_icon.png 12 December, 2024 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా, సాంస్కృతిక రంగాలపై విద్యార్థులు ద్రుష్టి సారించాలి

12-12-2024 12:02:01 AM

క్రీడల్లో ప్రతిభ కనబర్చి గుర్తింపు తెచ్చుకోవాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ప్రగతి మైదానంలో సిఎం కప్ క్రీడాపోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలపై ద్రుష్టి సారించి సమాజంలో తగిన గుర్తింపు తెచ్చుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని ప్రగతి మైదానంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను బుధవారం ఎమ్మెల్యే కూనంనేని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సభలో కూనంనేని మాట్లాడుతూ.. ఎంచుకున్న క్రీడలో నైపుణ్యాన్ని సంపాదించుకొని విజయాలు సాధించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని, ఉద్యోగావకాశాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడా, సంస్కృతి రంగాలవైపు ప్రోత్సహించి, వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి పరిచయం చేయాలన్నారు. సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలో స్తానం సంపాదించుకొని జిల్లాకు పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎస్ కె సాబీర్ పాషా, ఎంఇఓ ప్రభు దయాళ్, మున్సిపల్ కమిషనర్ శేషంజన్ స్వామి, సిపిఐ వార్డు కౌన్సిలర్లు బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణాచారి, నాయకులు మాచర్ల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.