హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ విద్యతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(District Collector Anudeep Durishetti) అన్నారు. ఈ మేరకు సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం ద్వితీయ స్థానం కైవసం చేసుకున్న సందర్భంగా కోచ్ పులి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తిని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రీడాకారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం తెలంగాణ కోచ్ పులి కిషోర్ కుమార్ మాట్లాడుతూ... జాతీయస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాల సహకరించిన డీఈవో రోహిణికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ డాక్టర్ కె రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.