27-04-2025 12:00:00 AM
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్
చేవెళ్ల, ఏప్రిల్ 26: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం వస్తుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్ చెప్పారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని కేజీ రెడ్డి కాలేజీ ఆవరణంలో ఎన్ ఎస్ యూఐ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన స్పోరట్స్ మీట్ ముగింపు కార్యక్రామనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విన్నర్స్, రన్నర్స్‌కు ట్రోఫీలు, బహు మతులు అందజేసి మాట్లాడారు.
ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట స్వామి నేతృత్వంలో రాకేష్ యాదవ్ , ఇతర నాయకులు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. స్టూడెంట్లు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచిం చారు. ప్రస్తుతం బీజీ లైఫ్ లో తప్పనిసరిగా కొంత సమయాన్ని క్రీడలు, వ్యాయామానికి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాన య్య, మాజీ ఎంపీటీసీ కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.