calender_icon.png 13 December, 2024 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

12-12-2024 10:28:19 PM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. సీఎం కప్ ఆటపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి బహుమతులు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలను నిర్వహించిందన్నారు. లైబ్రరీలు విద్యార్థుల మేథస్సును పెంచితే.. క్రీడలు ఆరోగ్యాన్ని పెంచుతాయని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షాబాద్ దర్శన్, వేణుగోపాల్, లక్ష్మణ్, మహేందర్, రామ్ రెడ్డి, శ్రీనివాస్, రాఘవరెడ్డి, రాజుగౌడ్, ప్రవీణ్, వివిధ స్కూళ్ల టీచర్లు పాల్గొన్నారు.