24-02-2025 12:52:20 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
మందమర్రి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని, శరీర దారుఢ్యంతో పాటు మానసికల్లాసానికి క్రీడలు దోహదపడతాయని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలోని సింగరేణి సిఐఎస్‌ఎఫ్ బ్యారక్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్తు ఎదుగుదలకు క్రీడలు ముఖ్యమని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు. క్రీడల ద్వారా శారరీకంగా, మానసికంగా దృఢత్వంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి పాఠశాలలో కరాటేను తప్పనిసరి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో వివిధ జిల్లాల నుండి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలలో గెలిచిన వారికి ఆయన బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రంగు శ్రీనివాస్, మాయ రమేష్, బిజెపి నాయకులు ధార రవి సాగర్ దంపతులు, రజనీష్ జైన్, అక్కల రమేష్, దుర్గం అశోక్, డివి దీక్షితులు, సప్పిడి నరేష్, కరాటే మాస్టర్లు హరికృష్ణ, భూమయ్య,తోట రమేష్ రాజా, సంతోష్, పోచంపల్లి వెంకటేష్, లు పాల్గొన్నారు.