calender_icon.png 23 November, 2024 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

23-11-2024 07:34:49 PM

రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యనభ్యసించే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలను శనివారం కొత్వాల ఒలింపిక్ జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యార్థి దశ నుండే క్రీడల్లో నైపుణ్యత ప్రదర్శించాలని అన్నారు.

క్రీడల పట్ల ఆసక్తి వున్నా వారికి మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఎంతగానో ఉంటుందని కొత్వాల అన్నారు. నూతనంగా ఎంపికైన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ను సన్మానించిన కొత్వాల ఇటీవల నూతనంగా ఎంపికైన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు డాక్టర్ గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, చైర్మన్ మహేందర్, సెక్రటరీ రాజేంద్రప్రసాద్, ఇతర సభ్యులను కొత్వాల శాలువా, బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా విజేతలకు కొత్వాల మెడల్, మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో డి వై ఎస్ ఓ పరంధామరెడ్డి, మున్సిపల్ కమీషనర్ సుజాత, ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, మహేందర్, పాల్వంచ బ్రాండ్ అంబేస్డ్ర్ సింధు తపస్వి, అథ్లెటిక్ కోచ్ లు నాగేందర్, మల్లిఖార్జున్, గిరి, ఇందు, కృష్ణ, మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, తదితరులు పాల్గొన్నారు.