calender_icon.png 18 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి..

17-03-2025 07:04:39 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో "From campus to career" సెమీనార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా Young Entrepreneur విస్ఫోర్ట్ & ఏబిసి edtech ఫౌండర్ అండ్ సీఈవో మిస్ దిల్మిత్ చాదా హాజరయ్యారు. ఈ  సందర్భంగా దిల్ మీట్ చాదా మాట్లాడుతూ... విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లాలని అన్నారు. సమాజంలో చాలా ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఉన్నాయనీ, విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగానికి మరి వ్యాపారానికి సంబంధించిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. నేటి ప్రపంచంలో ప్రతి అంశం మన చదువు మన నైపుణ్యాలతో ముడిపడి ఉందన్నారు.

విద్యార్థులు బాల్యవివాహాలను అరికట్టి జీవితంలో సిద్ధపడ్డాకనే వివాహా జీవితంలోకి వెళ్లాల్సిందిగా కోరారు. ఎంతో మంది మహిళలు వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండడం, దేనికి నిదర్శనం మరి చదువు వారి నైపుణ్యం సమాజంలో ఉన్న అవకాశాలను వచ్చినయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, కొత్త నైపుణ్యమైన స్కిల్స్ ను నేర్చుకొని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు. అనంతరం ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులకు మెమొంటెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ రమేష్ చైతన్య, ఇందర్ దీప్, కళాశాల అధ్యాపకులు జైప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, మీరా, కవిత, శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు.