నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): విద్యార్థులు ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నా రు. శుక్రవారం కొల్లాపూర్ నియో జకవర్గంలోని విద్యార్థులకు, యువత లో ప్రేరణ, ఆత్మవిశ్వాసం, పెంపొం దించడానికి రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో పట్టణంలోని మినీ స్టేడియం లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యా ర్థులు పరీక్షల్లో నేర్చుకున్న విషయా లను సరైన విధంగా రాయలేక పోవడం ఒక ప్రధాన సమస్యగా మా రిందన్నారు. దీని కారణంగా వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతూ, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కోల్పోయి తప్పుదారుల్లో వెళ్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నా రు.
జీవితంలో ప్రతి ఒక్కరికి అపజ యం ఎదురవుతుందని, దాంతో కృంగిపోవద్దని తిరిగి దానిపై పోరాడి విజయం సాధించే వరకు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్య క్రమంలో డీఈవో రమేష్ కుమార్, డిఐఓ వెంకటరమణ, ఆర్డీవో బన్సీలా ల్, తాసిల్దార్ విష్ణు వర్ధన్ రావు వివిధ పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.