calender_icon.png 26 April, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్‌లో ఆసక్తిని పెంపొందించుకోవాలి

26-04-2025 12:00:00 AM

తైక్వాండో హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ

ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : విద్యార్థులు విద్యతో పాటు మార్శ ల్ ఆరట్స్ లో ఆసక్తి పెంచుకోవాలని హైదరాబాద్ జిల్లా తైక్వాండో  అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ఈ మేర కు శుక్రవారం ముషీరాబాద్ లో తైక్వాం డో సాయిరక్ష అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడి ంగ్, బ్లాక్ బెల్ట్ టెస్టులో ఉత్తీర్ణులైన క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్బంగా ము ఖ్య అతిథిగా హాజరైన కృష్ణ 50 మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బెల్టులు, మెడల్స్ పంపి ణీ చేసి మాట్లాడారు. 

తైక్వాండో క్రీడ లు ఆ త్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. వి ద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉం టుందని, విద్యా, ఉద్యోగ, రంగాలలో రిజర్వేషన్లు సైతం ఉటాయని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో  తైక్వాండో సాయిరక్ష అధ్యక్షు డు సాయి, సీనియర్ కోచ్లు లక్ష్మినారాయణ, రాకేష్ కుమార్, మణీష్, జెయందర్, వైష్ణవ్, సాకేత్, అబిజిత్, ధనూష్, క్రితిక్ పాల్గొన్నారు.