మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు
కోదాడ (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. పట్టణంలోని కొమరబండ వై జంక్షన్ సమీపంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ విద్యాలయాన్ని సోమవారం సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత మంత్రి ఉత్తమ్ దంపతులను విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రామంలో ప్రిన్సిపాల్ శోభారాణి, గోపాలకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.