calender_icon.png 25 November, 2024 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు అభిరుచి గల రంగాలను ఎంచుకోవాలి

24-11-2024 10:35:13 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యార్థినీ విద్యార్థులు ఒక లక్ష్యంతో జీవితంలో స్థిరపడేందుకు కృషి చేయాలని, మొదటి నుంచి అభిరుచి గల రంగాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని జిల్లా జడ్జి వసంత పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడోత్సవాల ముగింపు వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని ప్రత్యేక ప్రణాళికలతో చదువులో రాణించాలని చెప్పారు.

అదే విధంగా ఈ రోజుల్లో క్రీడలు కూడా ఎంతో ముఖ్యమైనవి అని క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసమే కాకుండా సమాజంలో ప్రత్యేక గుర్తింపు కోసం దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు అందరూ రోజు తప్పకుండా వార్తాపత్రికలను చదివి మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. ప్రజాసేవ చేయాలంటే ఐఏఎస్ మంచి మార్గమని ఆ దిశగా విద్యార్థులు అందరూ కష్టపడి చదవాలన్నారు. ఉన్నత ఆశయంతో చదివి తమ లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. ఆటల విషయంలో ఒక రోజుతో ఆగకుండా ప్రతిరోజు సాధన చేసి శారీరక దారుడ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. ఎగురుతున్న బెలూన్ గమనిస్తూ విద్యార్థులు అందరూ దానిలాగా తమ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని అన్నారు.

వసతి గృహాలలో విద్యార్థులందరికీ వారికి కావలసిన ఆట వస్తువులను సమకూరుస్తానని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యార్థులు షూటింగ్. ఆర్చరీలలో ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, వివిధ వసతి గృహాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.