04-03-2025 12:39:22 AM
షీ టీం మహిళ ఎస్సు నీలిమ
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి 3 : సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ,సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని షీ టీమ్స్ ఎస్సు నీలిమ అన్నారు. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని జడ్పీహెఎస్‌లో స్థానిక ఎస్సు బాలకృష్ణ, పోలీసు కళాబృందంతో కలిసి షీ టీమ్స్, సైబర్ నేరాలు,గంజాయి,మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దని చెప్పారు బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వంటి సమాచారం ఇతరులకు తెలుపవద్దని సూచించారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని అలాగే వేధింపులపై 1930కు సమాచారం తెలపాలని చెప్పారు.
ఆకతాయిలు విద్యార్థినీలను, మహిళలను వారి యొక్క ఆత్మ గౌరవం భంగపరిచినట్లైతే షీ టీం నెంబర్ 8712686056కు సమాచారం తెలియజేయవచ్చునన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి,పీడీ మల్లేశం, పోలీస్ కళాబృందం ఇంచార్జీ యల్లయ్య, కృష్ణ,చారి, పోలీస్ సిబ్బంది రాములు, శ్రీను, రవి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.