15-02-2025 01:49:49 AM
వికారాబాద్, ఫిబ్రవరి- 14 : జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులను వార్డెన్లు తమ స్వంత పిల్లలుగా బావించి వారికీ ఆరోగ్యకరమైన ఆహరం అందించాలని రాష్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
శుక్రవారము కల్లెక్ట్రేట్ కార్యాలయ సమావేశము హాలు నందు జిల్లాలోని 104 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్రభుత్వ, గురుకుల వసతి గృహాలకు శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి రూ. 25 లక్షల విలువైన వంట సామగ్రిని వార్డెన్ లకు పంపిణీ. చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను సమీకరించి ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామాగ్రిని అందించడం అభినందనీ యమన్నారు. ప్రభుత్వ హాస్టల్ లలో వస తుల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించడానికి నావంతు కృషి చేస్తానని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అదిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర బడ్జెట్ లో 7శాతంకు పైగా నిధులను విద్యా శాఖకు కేటాయించిందని అన్నారు. ఈవంట సామాగ్రితో వసతి గృహాలలో వంటలు మరింత సులభంగా, పరిశుభ్రంగా చేయడానికి ఉపయోగపడుతాయని, విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని అన్నారు.
ప్రభుత్వ హాస్టళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. మేను ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు సరిగ్గా పెడుతున్నారా లేదా అని పరిశీలించడానికి శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ హాస్టళ్ళను నిరంతరం తనిఖీ చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమమలో అసిస్టెంట్ ట్రిని కలెక్టర్ ఉమా హారతి, అదనాలు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్, డి ఆర్ డి ఏ శ్రీనివాస్. ఎస్స్ సంక్షేమ అధికారి మల్లేశం, ఉపేందర్, కమలాకర్ రెడ్డి, రేణుకా దేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.