కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు, అధ్యాపకుల చేతు ల్లో ఉందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ మండలం రాం నగర్ సెయింట్ పైస్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
డీఈవో రోహిణితో కలిసి ప్రదర్శనలో విద్యార్థుల ఎగ్జిబిట్లను పరశీలించారు. విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంపొందించుకో వాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈవో చిరంజీవి, సెయింట్ పైస్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లిండా జరాల్డ్, కోఆర్డినేటర్ జ్యోతి, ఎమ్మార్వో రాణాప్రతాప్‌సింగ్, జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని 78పాఠ శాలల నుంచి వచ్చిన విద్యార్థులు 147 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.