calender_icon.png 1 March, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి...

01-03-2025 06:18:56 PM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంపొందించి, వారిని భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులేదే నని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ ఆదర్శ పాఠశాల అధ్యాపకులు గోస్కుల సత్యనారాయణ రచించిన భారతీయ, పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనే పుస్తకాన్ని కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని, వృత్తిపరమైన అనుభవాలను గ్రంథస్తం చేసి ముందుతరాలకు అందించాలని కలెక్టర్ సూచించారు. మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తల గురించి ప్రస్తావించడం మంచి ప్రయత్నం అని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పాఠశాల సమన్వయకర్త దీకొండవార్ అజయ్, ప్రిన్సిపల్ రాము, బయోసైన్సు జిల్లా ఫోరం అధ్యక్షులు రఘువెందర్ లు పాల్గొన్నారు.