calender_icon.png 6 January, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

06-12-2024 06:49:55 PM

విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలలో జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి):  పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ రాంనగర్ సెయింట్ పైస్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని అన్నారు. సైన్స్ లేని జీవనం ఊహించుకోలేనిది అని మన మందరం సైన్స్ లో జరిగే సాంకేతిక పరిణామల వల్ల ఈ విధమైన జీవనం గడుపుతున్నామని అన్నారు. మనం కూర్చునే కుర్చీ, గాలి కోసం వాడే ఫ్యాన్, ధ్వని కోసం వాడే మైకులని కూడా సైన్స్ వల్లనే వచ్చాయాని అన్నారు. పెన్సులిన్ కనిపెట్టిన  అలగ్జాండర్ ఫ్లెమింగ్ అలాగే యాపిల్ చెట్టు నుండి కాయ కింద పడడం చూసిన న్యూటన్ గొప్ప శాస్త్రవేత్తగా చేసే మూల కారణం అని వారి సేవలను ఈ సందర్బంగ కొనియాడారు.

విద్యార్థులు సృజనాత్మకత నైపుణ్యంను పెంపొందించుకోవాలని అలాగే వినూత్నమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరు అలోచించి తమ భావి జీవితానికి పునాదులు వేసుకోవాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనలు ఇందుకు ఒక చక్కని వేదికగా వాడుకొని విద్యార్థులందరు ఆధునిక శాస్త్రవేత్తలుగా సమాజానికి ఉపయోగపడే పౌరులవ్వాలని ఆకాంక్షించారు. తదుపరి వైజ్ఞానిక ప్రదర్శనశాలను ప్రారంభించి, బాల, బాలికలు చేపట్టిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి అభినదించారు. ఈ ఎక్సీబీట్ లో 6 నుండి 10 వ తరగతి చదువుతున్న 78 పాఠశాలల విద్యార్థులచే 147 వైజ్ఞానిక పదర్శనలు ఏర్పాటు చేసారు. కార్యక్రమం ముందుగా విద్యార్థులచే కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రోహిణి, డిప్యూటీ డిఈఓ చిరంజీవి, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లిండా జరాల్డ్, కోర్డినేటర్ జ్యోతి, తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.