calender_icon.png 6 March, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు బోధించాలి

04-03-2025 12:00:00 AM

నిర్మల్, మార్చి 3 (విజయక్రాంతి) ః కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో విద్యార్థులకు అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. సోమవారం పంచశీల కాలేజీలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించి కొత్త ఉపాధ్యాయులకు విద్యాబోధన నైపుణ్యాల తదితర అంశాలపై మాట్లాడారు.

పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభ పద్ధతిలో విద్యాబో ధన జరిగేందుకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.