08-04-2025 12:55:26 AM
మద్యానికి దూరంగా ఉన్న వారిలోనూ ఫాటీ లివర్ సమస్యలు
అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాపరెడ్డి,ఎండీ సునీతారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7(విజయక్రాంతి) : ఆరోగ్య ప్రాధాన్యతను తెలిపే అంశాలను విద్యార్థులకు బోధించాలని అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాపరెడ్డి అన్నారు. ఆరోగ్యాన్ని కూడా కుటుంబ దినచర్యలో భాగం చేయాలని సూచించారు. హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 పేరిట అపోలో ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 25లక్షల మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. కాగా వీరిలో అనేక మందికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది వారు గుర్తించని దీర్ఘకాలిక వ్యాధులతో జీవిస్తున్నారన్నారు. అపోలో ఆస్పత్రుల ఎండీ సునీతా రెడ్డి మాట్లాడుతూ మద్యానికి దూరంగా ఉన్న వారిలోనూ ఫాటీ లివర్ సమస్యలు వస్తున్నాయని, వారిలో 68శాతం మందికి ఫాటీ లివర్ సమస్యలు ఉన్నాయని, వారిలో 85శాతం మంది మద్యానికి దూరంగా ఉన్నారని తెలిపారు.