calender_icon.png 5 December, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలి

04-12-2024 10:15:01 PM

మండలంలోని పలు పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

చేగుంట: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చేగుంట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోనే స్టాక్ ను దించుకోవాలని సూచించారు. వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఎక్స్పెరి డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్ళీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తలుపులు, కిటికీలు, గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో జయచంద్ర రెడ్డి, తహసిల్దార్ సత్యనారాయణ, ఆర్ ఐ నర్సింగ్ యాదవ్, ఉపాధ్యాయులు సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.