calender_icon.png 10 January, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్ తో విద్యార్థులను చైతన్యవంతం చేయాలి

09-01-2025 08:27:49 PM

అదనపు పోలీస్ కమిషనర్ బసవరెడ్డి...

నిజామాబాద్ (విజయక్రాంతి): మానవ జీవితంలో పెరుగుతున్న సాంకేతిక వినియోగం వలన సైబర్ నేరాల సంఖ్య సమపాళ్లలో పెరుగుతోందని సైబర్ నేరాలను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు ప్రజలందరికీ అందుబాటులోకి పోలీస్ శాఖ ఉంటుందనీ ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే లక్ష్యంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ గట్టు బసవరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్ లో భాగంగా స్కూల్ విద్యార్థులను చైతన్య పరిచయ కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పద్ధతులకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల అవసరం ఉందన్నారు. పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్చరణ రూపొందించి పనిచేస్తుందన్నారు. 

సైబర్ క్రైమ్ నేరాలకు ఎవరు ఆకర్షితులు కాకూడదని ఎవరైనా సైబర్ నేరాల ఉచ్చులో పడ్డట్లయితే వారు 1930 ద్వారా సైబర్ క్రైమ్ కు రిపోర్ట్ చేయవచ్చని లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని మరొక సంబంధిత పోలీస్ స్టేషన్ సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రధానంగా బాధితులు డబ్బు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకురావాలని మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే తక్షణమే నిలిపివేసి సంబంధిత వారి యొక్క ఖాతాను నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సైబర్ నేరాలలో పూర్తి ఆధారాలను సేకరించి నేరస్తులను గుర్తించి శిక్ష పడేలా చేయడం బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నిత్యం విద్యార్థులు ఏదో ఒక మోసాలలో చిక్కుకోకుండా వాటిపట్ల తగు జాగ్రత్తలు వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఐపీఎస్ సాయికిరణ్, పత్తిపాక జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముఖిత్ భాషా, సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.