calender_icon.png 1 January, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

29-12-2024 07:42:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): సర్వ శిక్ష అభియాన్(Sarva Shiksha Abhiyan) ఉద్యోగులు సమ్మె చేయడంతో కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది సమ్మెలో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం(CPM) జిల్లా కమిటీ సభ్యులు పసియోద్దీన్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమ్మెతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు ప్రకటిస్తున్న చాలా పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని తెలిపారు. సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేజీబీవీ విద్యార్థులకు ఇబ్బందులు కాకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోశెట్టి సురేష్, శంభు, తదితరులు పాల్గొన్నారు.