calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

17-04-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

హాజీపూర్ (మంచిర్యాల), ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో గల కేంద్రీయ విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యాలయం పరిసరాలు, గదులను పరిశీలించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం ద్వారా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారని, వారి స్ఫూర్తిగా విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించే విధంగా ఉపాధ్యా యులు కార్యచరణ ప్రకారంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.