ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28(విజయక్రాంతి) : ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిం చాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశిం చారు. గురువారం సైదాబాద్‌లోని ఎస్సీ బాలికల, బండ్లగూడలోని ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహాలను ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్యతో కలిసి ఆయన తనిఖీ చేశారు.
హాస్టల్‌లోని పరిసరాలను పరిశీలించారు. భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరో గ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీరోజు ఆహారాన్ని వార్డెన్ రుచి చూశాకే.. విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు.