calender_icon.png 16 January, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల నుండి విద్యార్థులను కాపాడాలి

16-01-2025 06:51:22 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...

కరీంనగర్ (విజయక్రాంతి): మత్తు పదార్థాల వినియోగం బారిన పడకుండా విద్యార్థులను కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) ఎక్సైజ్, పోలీసు అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎక్సైజ్, పోలీస్ సహా వివిధ శాఖల అధికారులతో గురువారం వర్చువల్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో కళాశాలలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని అన్నారు. అక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వాడకం పూర్తిగా నిరోధించాలని సూచించారు. ఎక్కడైనా, ఎవరైనా డ్రగ్స్ వినియోగించినట్లు తేలితే వారికి డి అడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలని సూచించారు. ఏవైనా అనుమానాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి జనార్ధన్, వ్యవసాయ అధికారి విజయ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.