జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్...
సంగారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు భారత రాజ్యాంగ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ తెలిపారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర ఆదేశాలతో మహాత్మా జ్యోతిబా పూలే, బాలుర రెసిడెన్షియల్ పాఠశాల అవగాహన సదస్సు నిర్వహించారు. సంగారెడ్డి నందు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి.రమేష్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్టాలపైన అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టాల గురించి విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. గురుకుల పాఠశాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఏదైనా న్యాయ సహాయం కావాలంటే న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.