21-04-2025 01:14:10 AM
నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రి ల్ 20(విజయ క్రాంతి): విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే స్వీయ రక్ష ణ, సమాజంలో జరుగుతున్న నేరా లపై అవగాహన కలిగించాలని హైదరాబాద్ నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరు మాళ్ అన్నారు. తద్వారా భవి ష్యత్తు లో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమ ల గిరిలోని ఎంఎస్బి విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సం దర్భంగా సైబర్ భద్రత, మాద కద్ర వ్య దుర్వినియోగం , అత్య వసర ప్ర తిస్పందన సంసిద్ధత గురించి ఆమె అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో రకరకాల మోసాలు జరుగు తున్నాయని, అందులో సైబ ర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉం డాలన్నారు. సెల్ ఫోన్‌లో ఏదో నొ క్కేస్తాం ,దీంతో ఏదో లింక్ వస్తుం ది అలాంటి వాటిని నొక్కితే మన బ్యాంకు ఖాతాలు ఖాళీ అవు తాయ న్నారు.
అలాగే పార్సిల్ వచ్చింది... డిజిటల్ అరెస్ట్ అంటూ రకరకాలుగా బెదిరిస్తూ మోసాలకు పాల్ప డుతున్నారని, ఇలాంటి వాటి పై అ వగాహన కలిగి ఉండాలన్నారు. ప్రమాదంలో ఉన్నపుడు తక్షణ పోలీ సు సహాయం కోసం డయల్ 100 , సైబర్ మోసాల ను నివేదిం చడానికి 1930 ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.