14-02-2025 01:01:21 AM
మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్
పిట్లం ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): విద్యార్థులకు ఉపాధ్యాయులు సృజనాత్మక పద్ధతులపై అవగాహన కల్పించాలని మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన ఉపకరణాలు టి ఎల్ ఎం ప్రజ్ఞోత్సవం పై ప్రాధాన్యతతో ప్రతి పాఠశాల నుండి ప్రాతినిధ్యాన్ని వహించారు.
మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ విద్యార్థులకు కనీస సామర్థ్యాలు సులభంగా అర్థం అవ్వడానికి బోధన ఉపకరణాలు వినియోగం చేయాలని సూచించారు.బోధనకు సృజనాత్మక పద్ధతులను అవలంభించడం ద్వారా విద్యార్థుల అభివృద్ధిని సునిశ్చితంగా అందించవచ్చు అని అన్నారు.
ఆ తర్వాత మండల నోడల్ అధికారి రమణారావు పాఠశాలల వారీగా సమీక్ష నిర్వహించి, సమర్థవంతమైన బోధనా విధానాలపై ప్రాథమిక సూత్రాలను వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్న కొడప్గల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, వివిధ పాఠశాలల సిఆర్ పిలు హైమద్ భాషా, విట్టవ్వ పాల్గొన్నారు.