calender_icon.png 23 March, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ కలిగి ఉండాలి

18-03-2025 01:40:51 AM

డాక్టర్  రేఖల శ్రీనివాస్ 

యాదాద్రి భువనగిరి, మార్చి 17 (విజయక్రాంతి):  విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, తల్లిదండ్రుల, గురువుల పట్ల గౌరవం కలిగి ఉత్తమ విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రేకల శ్రీనివాస్ అన్నారు.  భువనగిరి మండలం కోనూరు గ్రామ జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో సోమవారం నాడు జరిగిన స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

పదవ తరగత విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధమై మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం డాక్టర్ శ్రీనివాసును శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ అబ్బగాని వెంకటేష్  బిఆర్‌ఎస్ యువజన నాయకులు నాగేంద్రబాబు, బాత్క  అశోక్, స్టూడెంట్ మిత్ర సంస్థ ఫౌండర్ చుక్కల రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.