calender_icon.png 29 March, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి

26-03-2025 04:23:55 PM

ఆర్బిఐ ఎల్డిఓ దేబోజిత్..

మంచిర్యాల (విజయక్రాంతి): విద్యార్థులందరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఆర్బిఐ లీడ్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్డిఓ) దేబోజిత్ అన్నారు. హాజీపూర్ మండలంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో బుధవారం ఆర్థిక అక్షరాస్యలపై నిర్వహించిన అవగాహన సదస్సులో లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్డీఎం) తిరుపతితో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలని, బ్యాంకులు అందిస్తున్న వివిధ సేవలు, ఇన్సూరెన్స్ లోన్స్, డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్స్ పై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటివి జరుగుతున్నాయో విద్యార్థులకు తెలియజేశారు. వాటిపట్ల అప్రమత్తంగా ఉంటూ ఏమైనా సంఘటనలు జరిగితే 1930 లేదా ఆర్బిఐ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులకు శ్రద్ధతో చదువుకొని విదేశాలకు పై చదువులకు వెళ్లాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పై చదువుల కోసం బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయని, వాటిని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ (వీడ్స్) సీసీ రాజశేఖర్, వీడ్స్ సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్స్ రవళి, శ్రీనివాస్ గౌడ్, మహేష్, రాజేష్, రమేష్ గ్రామపంచాయతీ కార్యదర్శి, కస్తూర్బా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.