calender_icon.png 21 February, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

19-02-2025 08:13:20 PM

SI రంజిత్...

మణుగూరు (విజయక్రాంతి): రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సై రంజిత్ అన్నారు. బుధవారం మణుగూరు మండలంలోని రామానుజవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు,  మాదకద్రవ్యాల కట్టడిలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI రంజిత్ మాట్లాడుతూ... విద్యార్థి దశ నుంచే యువత మాదకద్రవ్యాల వినియోగంచడం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించి మాదకద్రవ్యాల మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటున్నారన్నారు.

డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుందని, దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులదేనని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలను తెలుపుతూ మొబైల్ ఫోన్లో వచ్చే ఎటువంటి లింక్స్ ను  ఓపెన్ చేయకూడదని, మీ అకౌంట్ హ్యాక్ అయి డబ్బులు పోయినట్లయితే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు వెంటనే డయల్ చేయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోద, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.