calender_icon.png 6 February, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి

06-02-2025 06:16:37 PM

మందమర్రి (విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థి దశ నుండే వారికి క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులు గంజాయి వంటి వాటికి బానిస కాకుండా అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవ సాధికారిత సంస్థ కార్యదర్శి మారం అర్పిత రెడ్డి కోరారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించు కొని గురువారం పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రమాదకమైన క్యాన్సర్ వ్యాధిపై అవగాహనతోనే జయించవచ్చు అని అన్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగపడితాయని అన్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం, దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు మలేరియా ఎయిడ్స్ క్షయవ్యాదుల కంటే ఎక్కువమంది క్యాన్సర్ తో మరణిస్తున్నారని అన్నారు.

2030 నాటికి క్యాన్సర్ మరణాల సంఖ్య 13 మిలియన్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందిని నివారించవచ్చని, వ్యాధిని ముందుగానే గుర్తిస్తే, మరో మూడింట ఒక వంతు మందిని నయం చేసి సరైన చికిత్స అందించి ఆరోగ్యం కాపాడవచ్చని సూచించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగేలా క్యాన్సర్, దాని ముందస్తు గుర్తింపు, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అడిగిన క్యాన్సర్ సందేహాలు ప్రజల్లో ఉండే అపోహలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ లీగల్ ఏఐడి కౌన్సిల్, అడ్వకేట్ ఎండి సందాని, తవక్కలు విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.