calender_icon.png 5 March, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

05-03-2025 12:54:43 AM

 మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్  

 రాజేంద్రనగర్, మార్చి 4 (విజయ క్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా కాలేజీలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవెల్ స్పోరట్స్ పోటీలకు ఆయన రాజేంద్రనగర్ బిజెపి కంటెస్టేట్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. క్రీడలలో గెలుపోటములు సహజమని తెలిపారు. ఆటల్లో క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ సురేందర్ రెడ్డి, ధనుంజయ, చైర్మన్ జయలక్ష్మి, ప్రిన్సిపల్ ఉషాశ్రీ  ఫిజికల్ డైరెక్టర్  సైదయ్య, వివిధ  పలు కాలేజీల నుంచి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.