calender_icon.png 28 February, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

28-02-2025 06:51:34 PM

ఎంఈఓ పోచయ్య.. 

బెల్లంపల్లి: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని భవిష్యత్తులో పైకి ఎదగాలని బెల్లంపల్లి ఇన్చార్జి ఎంఈఓ జాడి శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని భావితరాలకు చక్కని ఆవిష్కరణలను అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన సైన్స్ మోడల్స్ ను పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం విజయలక్ష్మి, సైన్స్ ఉపాధ్యాయులు మేరీ సుజాత, సుమన్, ఉపాధ్యాయులు రవి, శిరీష, ఫిజికల్ డైరెక్టర్ బండి రవి తదితరులు పాల్గొన్నారు.