18-03-2025 12:00:00 AM
మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు చక్కగా రాసి అగ్రశ్రేణి ఫలితాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయు డు కోట కనకయ్య అన్నారు. కేసముద్రం మండలం, తాళ్లపూసపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం10వ, తరగతి చదివిన విద్యార్థులకు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోట కనకయ్య అధ్యక్షతన వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట కనకయ్య మాట్లాడుతూ..10వ, తరగతి విద్యార్థులు నిర్భయంగా వార్షిక పరీక్షలు రాసి అగ్రశ్రేణి ఫలితాలు సాధించి, లక్ష్యాన్ని సాధించడం తోపాటు తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ బద్ధంగా నూతన వస్త్రాలు ధరించి పాఠశాలకు హాజరు కాగా పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా విద్యార్థు లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉపాధ్యా యులు, విద్యార్థులతో పాటు చూపరులను విశేషంగా అలరించాయి. నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామ నివాసి పల్లపో తుల లక్ష్మీ నరసయ్య టెన్త్ క్లాస్ విద్యార్థులతో పాటు విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్లు, టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్కేల్స్, పెన్నులు బహుకరించారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ బృందం దేశబోయిన వెంకన్న, ఎస్. నరేష్ కుమార్, జి. శ్రీనివాస్,జి.గోపికృష్ణ,ఎం. జావేదుల్ల బేగ్, టి.భార్గవి, ఎండి ఫహీమ్,జె. వీరస్వామి,లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.