ఎమ్మెల్సీ రహమత్ బేగ్...
మందమర్రి (విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యసాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని హైదరాబాద్ ఎమ్మెల్సీ రహమత్ బేగ్ కోరారు. గురువారం పట్టణంలోని కస్తూర్బా ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్, ఏఐ ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఇంగ్లీష్ షబ్బరొద్దీన్, నాయకులు నిజముద్దీన్, వాజీద్, యాఖుబ్, యూసుఫ్, సమీర్, సుమీర్, హాఫిజ్ సలీం, మున్నాలు పాల్గొన్నారు.