ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపిన సంఘటన జిల్లా కేంద్రంలో నెలకొంది. తెలంగాణ ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఇటీవల జరిగిన బదిలీలలో 17 మంది ఇతర ప్రాంతాలకు బదిలీ కాగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలకు రావడంతో విద్యార్థులు గురువారం ఆందోళన బాట పట్టారు. పాఠశాల నుండి ర్యాలీగా ప్రధాన రహదారి వరకు వచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు అన్యాయం జరుగుతుందని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యా బోధన చేసేవారు లేక తమ పాఠశాలలో ఖాళీగా కూర్చునే పరిస్థితిలకు ఉందని దీంతో తమ భవిష్యత్తు పై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.