29-03-2025 03:35:50 PM
విద్యార్థి మృతికి ప్రిన్సిపల్ ఏ కారణం
మృతదేహంతో గురుకుల ముందు ఆందోళన
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు
సిర్గాపూర్: నల్ల వాగు గురుకులం పాఠశాలకు చెందిన నిఖిల్ అనే విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ లోని వెల్నెస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తూ మృతి చెందిన నిఖిల్ మృతదేహంతో ప్రత్యేక వాహనంలో నల్ల వాగు గురుకులం ముందుకు తీసుకొచ్చి శనివారం ఆందోళన చేపట్టారు. దీంతో స్థానికంగా తీవ్రంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి, తహశీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబీకులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా కుటుంబీకులు మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, గురుకులంలో పనిచేస్తున్న ఏఎన్ఎం సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో తమ కుమారుడు మరణించాడని వాపోయారు. తీవ్ర జ్వరం వచ్చి తెల్ల రక్త కణాలు పడిపోయిన కూడా కళాశాలలో సిబ్బంది ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వారు విలపిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. తాము కళాశాలకు వచ్చి తమ కుమారుని వైద్యశాలకు తీసుకు వెళ్లే వరకు ఎవరు స్పందించలేదని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంఘీభావం: విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపి తన మద్దతును తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని ఆయన ఆరోపించాడు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సందర్భంగా ఆయన గురుకుల పాఠశాల చీఫ్ సూపరిండెంట్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు.
విద్యార్థిని కుటుంబానికి ఉపాధి అవకాశం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి తండ్రి వికలాంగుడని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్లు సంబంధిత అధికారి కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి: విద్యార్థి మృతికి కారణమైన నల్లవాగు గురుకులం ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి , వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.